

ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న మీడియా సమావేశంలోకి సుమలత తన వర్గంతో కలిసి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫెడరేషన్ నాయకులతో సుమలత వాగ్వాదానికి దిగారు. సమావేశానికి తమను అనుమతించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ఫిలిం ఛాంబర్‌కు చేరుకున్నారు. ఇటీవల సుమలత వర్గం నిర్వహించిన ఎన్నికను ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. జానీ మాస్టర్‌ను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. ఫెడరేషన్, డ్యాన్సర్ అసోసియేషన్ పేరుతో ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారని, తమకు అండగా ఉంటారనే నమ్మకంతోనే తాము ఛాంబర్‌కు వచ్చామని చెప్పారు. అయితే, తమను సమావేశంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. దీంతో ఫిలిం ఛాంబర్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!