

సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ (SATA) ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రి సీతక్క దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను విదేశాల్లోని తెలంగాణ ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లోనూ మంత్రి సీతక్క పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ సమాజంతో ఆమె సమావేశమై, బతుకమ్మ వేడుకలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్న ప్రవాస తెలంగాణ సంఘాలతో పరస్పర సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!