

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి-65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో రోడ్డు మరమ్మతులు, విస్తరణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూప్రాన్‌పేట స్టేజి నుంచి బోర్రలగూడెం వరకు వన్‌వేలో వాహనాలను మళ్లించడంతో ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో కోయిలగూడెం నుంచి బోర్రలగూడెం వరకు కూడా భారీగా ట్రాఫిక్ నిలిచింది.
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతో అడుగడుగునా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగ నేపథ్యంలో రేపు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితిపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను వాహనదారులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!