
సినిమాలు

జీహెచ్‌ఎంసీలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 102 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ.70 కోట్ల మేర డబుల్ బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ చెల్లింపుల్లో డబుల్ బిల్లులతో పాటు అదనపు మొత్తాలు కూడా చెల్లించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం బయటపడిన తర్వాత కాంట్రాక్టర్ల నుంచి నిధులను తిరిగి రాబట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 12 మంది కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వ్యవహారంలో బాధ్యత ఉన్నట్లు భావిస్తూ డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న ఆడిట్ శాఖ అధికారి శరత్ చంద్రను విధుల నుంచి తప్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!