
సినిమాలు

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది 2’ తెరకెక్కుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అదే సమయంలో నవంబర్ 19న సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమఠం, మాగంటి శ్రీనాథ్, వెంకటేశ్ కాకుమాను, అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో చిత్రబృందం ఉత్సాహంగా కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవంబర్‌లో ప్రేక్షకులకు ఈ సీక్వెల్ ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!