

చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలో విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!