
సినిమాలు

అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చే కామెడీ జానర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్ర మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది.
సురభి, రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 4న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ కామెడీకి తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!