
జనరల్

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం సమర్పించి, పట్టువస్త్రాలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయి పండుగ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క మరియు పలువురు ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు. భక్తుల నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!