
బిజినెస్

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండటంతో అధికారులు 27 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,77,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.33 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోని 11 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!