
బిజినెస్

కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో అదృష్టం తలుపుతట్టింది. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక షాపింగ్ డ్రాలో పాల్గొన్న ఆమెకు పూర్తిగా ఉచితంగా ఒక స్టూడియో అపార్ట్‌మెంట్ లభించింది. 500 దిర్హామ్‌లు, అంటే సుమారు రూ.13 వేల విలువైన కొనుగోళ్లు చేసి ఆమె ఈ పోటీలో పాల్గొన్నారు.
డ్రాలో పాల్గొన్న విషయాన్ని అయేషా తర్వాత మర్చిపోయారు. కొన్ని రోజుల అనంతరం అపార్ట్‌మెంట్ గెలుచుకున్నట్లు నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ రావడంతో మొదట నమ్మలేదు. అయితే ఈ-మెయిల్ ద్వారా పూర్తి వివరాలు అందడంతో నిజంగానే ఇల్లు గెలుచుకున్నట్లు తెలుసుకున్నారు. తాము ఇల్లు కొనాలని భావిస్తున్న సమయంలో ఈ బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందని అయేషా తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!