

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘వెంకీ అనిల్5’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయానంతరం ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో వెంకటేష్ పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. వెంకటేష్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, కుటుంబ భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!