
జనరల్

బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితమే తాను అండాలను భద్రపరుచుకున్నట్లు ఆమె తెలిపారు. ‘మిమి’ సినిమా కోసం దాదాపు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
పెళ్లి, పిల్లల వంటి జీవిత నిర్ణయాలు సమాజం ఒత్తిడి లేదా వయసు కారణంగా తీసుకోవద్దని కృతి అన్నారు. మనసుకు అనిపించినప్పుడు, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు. అండాలను భద్రపరచుకోవడం తనకు తానే ఇచ్చుకున్న అత్యుత్తమ బహుమతిగా భావిస్తున్నానని, భవిష్యత్తులో వాటిని ఉపయోగిస్తానో లేదో తెలియకపోయినా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!