

హర్యానాలోని సోనిపట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్న రోహిత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బరోటా-ఛత్తేరా రహదారిపై జరిగిన ఎదురుకాల్పుల్లో రోహిత్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం అతడిని సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి వద్ద నుంచి పిస్టోల్, బైక్, బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వ్యాపారిని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసిన కేసులోనూ రోహిత్‌పై ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హర్యానీ గాయకుడు దిలేర్ ఖర్కియా వాహనంపై జరిగిన కాల్పుల కేసులోనూ అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. రోహిత్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, వాటిలో దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అతడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!