
రాజకీయాలు

ఆషాఢమాసం మూడో ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా అమ్మవారు ఫలాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల పండ్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించగా, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భారీగా తరలివచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!