
జనరల్

నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన పలు ఆస్తులు, ఇతర ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇవి ఆయనకు తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!