

అనంతపురం జిల్లా కూడేరు సమీపంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడిని ఢిల్లీలో కలిశారు. గత సర్వేలో భౌగోళిక పరిమితులు ఉన్నట్లు నివేదిక వచ్చిన నేపథ్యంలో, పాత విశాఖపట్నం విమానాశ్రయంలో అమలు చేసిన వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని పరిశీలిస్తూ మరోసారి సమగ్ర సాంకేతిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే పదేళ్లలో ఉడాన్ పథకం కింద అభివృద్ధి చేయనున్న కొత్త విమానాశ్రయాల జాబితాలో కూడేరు ఎయిర్‌పోర్టును చేర్చాలని కేంద్రాన్ని కోరారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ ఉత్పత్తుల్లో దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉందని, ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో పండ్లు, కూరగాయల ఎగుమతులు వేగవంతమై రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని వివరించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!