

మంత్రి కొండా సురేఖ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసేందుకు ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖకు సంబంధించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై అధిష్ఠానం చర్చించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి సురేఖ భవిష్యత్తుపై చర్చలు, పార్టీ అంతర్గత అంశాలు ఢిల్లీ కేంద్రంగా కీలకంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!