

క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు పేరుగాంచిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి తన సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ను అవుట్ చేసేందుకు ఫిలిప్స్ బౌండరీ సమీపంలో ఒంటి చేత్తో అందుకున్న అద్భుత క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని నరైన్ డీప్ మిడ్ వికెట్ దిశగా బలంగా కొట్టగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ వేగంగా కదిలి, కుడిచేతిని చాచి క్యాచ్‌ను అందుకున్నాడు.
ఈ క్యాచ్ పూర్తయిన తర్వాత ఫిలిప్స్ సైతం కాసేపు నమ్మలేనట్లుగా స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గయానా అమెజాన్ వారియర్స్ 16 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేయగా, వర్షం కారణంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ లక్ష్యం సవరించబడింది. చివరకు ట్రిన్‌బాగో 16 ఓవర్లలో 172/7కి పరిమితమై, డీఎల్‌ఎస్ పద్ధతిలో గయానా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. నరైన్ కేవలం 1 పరుగుకే ఫిలిప్స్ చేతికి చిక్కాడు.
ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లు పట్టడంలో ఫిలిప్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే అభిమానులు అతడిని తరచూ ‘సూపర్‌మ్యాన్’తో పోలుస్తుంటారు. ఈ క్యాచ్ వీడియోను సీపీఎల్ అధికారిక ఖాతా కూడా పంచుకోవడంతో క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్ ఫీల్డింగ్ నైపుణ్యానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!