

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైలులో కొందరు భారతీయ పర్యాటకులు బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలు మధ్యలో నిలబడి పాటలు పాడుతున్న వారితో పాటు మరికొందరు చేతులు ఊపుతూ, ఆ దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేసినట్లు వీడియోలో కనిపించింది. చుట్టూ ఉన్న ప్రయాణికులు మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉండగా, కొందరు అసంతృప్తిగా వారివైపు చూస్తున్నట్లు కనిపించారు.
ఈ వీడియోను ఎక్స్ యూజర్ అమిత్ తన ఖాతాలో పోస్టు చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రజా రవాణాలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని పలువురు వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ఇలాంటి ఘటనలు ప్రతికూల అభిప్రాయాలకు దారి తీయవచ్చని మరికొందరు పేర్కొన్నారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను ఇతర ప్రయాణికుల అసౌకర్యానికి కారణమయ్యేలా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించకూడదని సూచించారు. రైలు సిబ్బంది ఎందుకు జోక్యం చేసుకోలేదని కూడా కొందరు ప్రశ్నించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!