
క్రీడలు

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లు సంప్రదాయ కర్రపూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొని ఈ ఏడాది మహాగణపతి నమూనా పోస్టర్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహాగణపతి కుడివైపున సోమనాథ జ్యోతిర్లింగం నమూనాను, ఎడమవైపున కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఈసారి ప్రత్యేక థీమ్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!