

వాట్సాప్ గ్రూపుల ద్వారా గూఢచర్యం జరుగుతోందన్న అనుమానాలు దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో రక్షణ, భద్రతా విభాగాలకు చెందిన సంస్థల్లో దేశవ్యాప్త తనిఖీలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు 50 వాట్సాప్ గ్రూపులను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ గ్రూపులతో సంబంధం ఉన్న అధికారుల కార్యకలాపాలపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సున్నితమైన సమాచార మార్పిడి, అనుమానాస్పద పరిచయాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వ్యవహారంపై సుమారు మూడు నెలల పాటు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రక్షణ, భద్రతా విభాగాలు తమ పరిధిలోని వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై తక్షణమే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, కీలక సమాచార లీకేజీని అడ్డుకోవడం, భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశాలుగా భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!