

కృష్ణా జలాల వినియోగం మరియు త్రాగునీటి అవసరాలపై తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వినియోగం, సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీటి అవసరాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టులను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణం, సాగునీటి హక్కులు, భవిష్యత్ అవసరాల పరిరక్షణపై సాంకేతిక అంశాలతో కూడిన చర్చలు జరిగాయని తెలిపారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని, రైతాంగ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!