

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, దేశ సైనిక శక్తికి ‘ఆపరేషన్ సిందూర్’ నిదర్శనమని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను ప్రపంచం గమనించిందని, ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులు భారత సంకల్పాన్ని ప్రపంచానికి చాటాయని ఆయన అన్నారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని, త్వరలోనే ప్రపంచంలోని తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా ఎదిగిందని, స్వదేశీ 6జీ సాంకేతికత అభివృద్ధిపై వేగంగా పనిచేస్తోందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!