

సముద్ర గర్భంలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం కలిగిన స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ (డీఎస్‌వీ) ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సమక్షంలో ఈ నౌకను ప్రారంభించారు. గత ఏడాది నౌకాదళంలో చేరిన ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ తర్వాత సేవల్లోకి వచ్చిన రెండో డైవింగ్ సపోర్ట్ నౌకగా ఐఎన్‌ఎస్ నిపుణ్ నిలిచింది.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో ఐఎన్‌ఎస్ నిపుణ్‌ను నిర్మించింది. 10,500 టన్నుల బరువు మోసే సామర్థ్యం కలిగిన ఈ నౌక సముద్ర గర్భంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లి డైవింగ్ ఆపరేషన్లు నిర్వహించగలదు. ప్రమాదాల్లో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడం, సముద్ర గర్భంలో ప్రత్యేక ఆపరేషన్లకు మద్దతు అందించడం వంటి కీలక బాధ్యతలను కూడా ఇది నిర్వర్తించనుందని అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!