

వేంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సోమవారం ఆలయాన్ని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ముఖ్యంగా రెండో ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని జేఈవో సూచించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని, నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న జేఈవోకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ సురేంద్ర, సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణతో పాటు అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!