

‘పుష్ప’ రెండు భాగాలతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పుష్ప’తో పాటు ప్రస్తుతం సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యమైన విషయాలను బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల రూపంలో షేర్ చేశారు. అందులో ‘పుష్ప’లో లేడీ గెటప్‌లో నటించడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
‘పుష్ప’లో చీరకట్టుకుని మహిళగా నటించడం తన జీవితంలో చేసిన అత్యంత ఆల్ఫా పని అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తనకు ఎదురయ్యే ఒత్తిడిని అరుదుగా లభించే గొప్ప అవకాశంగా భావిస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులు యావరేజ్ కంటెంట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని, మంచి సినిమాను అందిస్తే మిగతా బాక్సాఫీస్ లెక్కలను ఆ సినిమా చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ సాధించిన విజయం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తోందని బన్నీ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!