

జపాన్‌ను ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. తూర్పు జపాన్‌తో పాటు టోక్యో మహానగర ప్రాంతంలోనూ బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్ అధికారుల ప్రకారం ఉదయం సుమారు 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సుమారు 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో జపాన్ భూకంప తీవ్రత స్కేల్‌పై 5 లోయర్ స్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంప ప్రభావంతో రవాణా సేవలకు అంతరాయం ఏర్పడగా, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప నష్టం నమోదైంది. తొలుత ఐదుగురు గాయపడినట్లు సమాచారం వెలువడింది. అయితే తాజా అధికారిక అప్‌డేట్ల ప్రకారం గాయపడిన వారి సంఖ్య 37కు చేరింది. వీరిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలయ్యాయి. టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!