

కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘జంతర్‌మంతర్ సీజన్-2’ త్వరలోనే ప్రారంభం కానుందని ప్రకటించారు. ఢిల్లీలో సీజేపీ వలంటీర్ల సమావేశం చివరి నిమిషంలో రద్దైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్-2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు అడుగుతున్నారని, వారికి సమాధానంగా త్వరలోనే ఉద్యమం మొదలవుతుందని చెప్పారు. అయితే ఉద్యమం ప్రధాన అంశాన్ని ఆయన తొలుత వెల్లడించలేదు.
ఢిల్లీలో సమావేశం నిర్వహించేందుకు హాళ్లు లభించకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని దీప్కే ఆరోపించారు. పలుచోట్ల నిర్వాహకులు పైస్థాయి నుంచి ఒత్తిడి ఉందని చెప్పి హాళ్లు ఇవ్వడానికి నిరాకరించారని, చివరకు బుక్ చేసిన హాల్ యజమానిని కూడా బెదిరించారని పేర్కొన్నారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. దీప్కే ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు, విద్యా రంగం, మౌలిక వసతులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తదుపరి ఉద్యమం ప్రభుత్వ బడుల బలోపేతంపై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!