
షోస్

భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మొబైల్ వినియోగదారులకు మరిన్ని రీచార్జ్ ఎంపికలు అందుబాటులో ఉండేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. తాజా సవరణ ప్రకారం టెలికాం సంస్థలు వాయిస్, ఎస్‌ఎంఎస్ సేవలకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక టారిఫ్ వోచర్లను 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతో అందించాలి. అలాగే ప్రతి నెలా ఒకే తేదీన రీన్యూ చేసుకునే ప్లాన్‌ను కూడా అందించాలి.
డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ఖర్చుతో తమ అవసరాలకు అనుగుణమైన ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. అయితే 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రతి రీచార్జ్‌ను తప్పనిసరిగా 30 రోజులకు మార్చాలని ఈ నిబంధన చెప్పడం లేదు. 30 రోజుల ప్లాన్‌తో పాటు ప్రతి నెలా ఒకే తేదీన రీన్యూ అయ్యే ప్లాన్‌ను అందించాల్సిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!