

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్నాలజీ, ఏఐ సంస్థల అధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన కృత్రిమ మేధస్సు భద్రత, భవిష్యత్తు వినియోగం, నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. ట్రంప్ ఏఐని ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పేర్కొంటున్నారు. ఈ భేటీలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్, ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ, ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ తదితరులు పాల్గొన్నారు.
అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత, అంతర్గత నియంత్రణలు, బాధ్యతాయుతమైన అభివృద్ధిపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఏఐ సంస్థలు అంతర్గత భద్రతా నియంత్రణలను బలోపేతం చేయడం, స్వతంత్ర ఆడిటర్లతో కలిసి పనిచేయడం, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అంశాలతో కూడిన స్వచ్ఛంద ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని ట్రంప్ ‘నైతికంగా కట్టుబడి ఉండే’దిగా అభివర్ణించినప్పటికీ, ఇది చట్టపరంగా తప్పనిసరి ఒప్పందం కాదు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!