
సినిమాలు

తెలంగాణలో జనసేన రాజకీయంగా మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. కొండా సుస్మిత తమ పార్టీ వరంగల్ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. సుస్మితతో పాటు కొండా మురళి, కొండా సురేఖ కూడా జనసేనలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం పార్టీలో చేరితే తెలంగాణలో జనసేన మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు యువత, మేధావులు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన తన రాజకీయ సత్తాను చూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!