

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా యష్ నటించిన టాక్సిక్ సినిమాతో డ్రాగన్‌కు ఉన్నట్లు కనిపిస్తున్న ఓ చిన్న పోలిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత టెన్షన్ కూడా మొదలైంది.
డ్రాగన్ గ్లింప్స్‌లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి కాలానికి సంబంధించిన కథనంలో ఓ ప్రత్యేకమైన డ్రగ్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదే డ్రగ్ పేరును టాక్సిక్ సినిమాలోనూ అదే తరహా నేపథ్యంతో ప్రస్తావించడంతో రెండు సినిమాల కాన్సెప్ట్ ఒకటేనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే టాక్సిక్‌లో ఈ అంశాన్ని చాలా పరిమితంగానే చూపించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ చర్చ కారణంగా ప్రస్తుతం డ్రాగన్‌తో పాటు టాక్సిక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!