

2013 నాటి లైంగిక దాడి కేసులో మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆగస్టు 6న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021లో గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసి ఆయనను దోషిగా నిర్ధారించింది.
బాంబే హైకోర్టు తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 2013 నవంబర్‌లో గోవాలో తెహెల్కా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా తనతో పనిచేసిన జూనియర్ మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఇదే సమయంలో తేజ్‌పాల్‌కు విధించిన శిక్షను జీవిత ఖైదుకు పెంచాలని కోరుతూ గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్షల అమలుపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం సవాల్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!