
జనరల్

నేపాల్ నుంచి బీహార్‌లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!