
జనరల్

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు రద్దు చేసి స్కూల్ విద్యలో కలపే అవకాశంపై కసరత్తు జరుగుతోంది.
పైలట్ ప్రాజెక్టు కింద 100 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో 11వ తరగతి బోధన ప్రారంభించనున్నారు. ఈ విధానం విజయవంతమైతే పాఠశాల మరియు ఇంటర్ విద్యకు ఒకే బోర్డు ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!