14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

Writer: Nithish 07:30 AM, 14 అక్టోబర్, 2026
ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా భారత్‌ ఎదుగుతున్నప్పటికీ, ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలమైన ఆర్థిక పునాదులు, ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం, నిరంతర సంస్కరణలే దేశ పురోగతికి ప్రధాన ఆధారాలని తెలిపారు. మంగళవారం బ్లూమ్‌బెర్గ్‌ నూతన ఆర్థిక వేదిక సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, వ్యూహాత్మక వనరుల కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు చూపగలవని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని, విదేశీ మారక నిల్వలు 700 బిలియన్‌ డాలర్లను దాటాయని వెల్లడించారు. పన్నులు, కార్మిక, దివాలా చట్టాల్లో సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా మారిందని వివరించారు.

భారత్‌ ఆర్థిక, సాంకేతిక శక్తిని ఇతరులను నియంత్రించేందుకు కాకుండా, వారికి అవకాశాలు కల్పించేందుకు వినియోగిస్తోందని మోదీ స్పష్టం చేశారు. వీధి వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారవేత్తల వరకు అందరూ ఒకే డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకోవడం సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనమన్నారు. కోవిడ్‌ సమయంలో అభివృద్ధి చేసిన కోవిన్‌ వేదికతో పాటు 100కు పైగా దేశాలకు టీకాలు సరఫరా చేయడం ద్వారా భారత్‌ అంతర్జాతీయ సహకారాన్ని చాటిందని తెలిపారు. 2014కు ముందు కొన్ని వందలుగా ఉన్న అంకుర సంస్థల సంఖ్య ప్రస్తుతం 2.5 లక్షలు దాటిందని, వాటిలో సగానికి పైగా చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్నాయని చెప్పారు. దాదాపు 45 శాతం అంకుర సంస్థల్లో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా లేదా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి ఐదు జనరిక్‌ ఔషధాల్లో ఒకటి భారత్‌లో ఉత్పత్తి అవుతోందని, దేశంలో 2,000కు పైగా గ్లోబల్‌ సామర్థ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు

అరాంకోపై క్షిపణి దాడి.. సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

ట్యాగ్లు
నరేంద్ర మోదీభారత ఆర్థిక వ్యవస్థభారత ఆర్థిక వృద్ధిబ్లూమ్‌బెర్గ్‌ నూతన ఆర్థిక వేదికఆర్థిక సంస్కరణలుడిజిటల్‌ చెల్లింపులుఅంకుర సంస్థలువిదేశీ మారక నిల్వలుజనరిక్‌ ఔషధాలుగ్లోబల్‌ సామర్థ్య కేంద్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన
జనరల్

నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు
బిజినెస్

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం
క్రీడలు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా  సీతారామన్
బిజినెస్

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా సీతారామన్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజకీయాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్
బిజినెస్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ
రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన
ఆరోగ్యం

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు
క్రీడలు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు
క్రీడలు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు
బిజినెస్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి
జనరల్

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం
జనరల్

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!