24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

Writer: Chandrika 04:57 PM, 24 జులై, 2026
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక ఆర్థిక కారిడార్‌ను మరింత బలోపేతం చేసేలా బళ్లారి-గుంతకల్లు మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్లు వ్యయం కానుందని, మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ఇప్పటికే 80 శాతం అందుబాటులో ఉందని తెలిపారు. సుమారు 46 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం మెరుగుపడనుంది. వేదావతి నదిపై భారీ రైల్వే వంతెనతో పాటు ఏడు ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏటా అదనంగా 1.6 కోట్ల టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఏర్పడటంతో పాటు పారిశ్రామిక, ఖనిజ, ఉక్కు, సిమెంట్, విద్యుత్ కేంద్రాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది.

మరోవైపు దేశీయ రసాయన పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు ‘భవ్య రసాయన్’ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా పోటీ విధానంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మూడు ప్లగ్-అండ్-ప్లే కెమికల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. కామన్ ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక, భద్రతా మౌలిక సదుపాయాలు, రైల్వే-పోర్టు అనుసంధానం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో రైల్వే విద్యుదీకరణ వేగంగా కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్బళ్లారి గుంతకల్లు రైల్వేఅశ్విని వైష్ణవ్భారతీయ రైల్వేఆంధ్రప్రదేశ్కర్ణాటకరైల్వే విస్తరణభవ్య రసాయన్కెమికల్ పార్కులువికసిత్ భారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!