
జనరల్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీలు మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం ఇండి కూటమి నేతలు రాజ్‌ఘాట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారు బస చేస్తున్న హోటల్ వద్ద పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. నేతలను హోటల్ వద్దే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
మరోవైపు ఇండి కూటమి నేతలు వెళ్లనున్న రాజ్‌ఘాట్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ బీఎన్‌ఎస్ సెక్షన్ 163 అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజ్‌ఘాట్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచడంతో పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!