
జనరల్

2019 డిసెంబర్ 23న, వైకాపా ప్రభుత్వ హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ట్రస్ట్ పేరుతో కడప రిమ్స్ ప్రాంగణంలో ఒక కీలక స్థలాన్ని కేటాయించుకున్నారు. అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనే పేరుతో భవన సముదాయం ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యుల విగ్రహాలు, ఫొటోలు ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజులకే అన్నదాన కార్యక్రమాలు ఆగిపోయాయి. అప్పటి నుంచి భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది.
ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వంద పడకల సామర్థ్యం ఉన్న ఈ భవనం ఖాళీగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. రోగుల అవసరాల కోసం ఈ భవనాన్ని తిరిగి వినియోగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అధికారులపై కూడా చర్యలు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!