
జనరల్

ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక ఆహార సంస్కృతితో గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరిగిన ఇండియా టుడే టూరిజం అవార్డ్స్ కార్యక్రమంలో హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డు లభించింది. దేశంలోనే అత్యుత్తమ పాకశాస్త్ర గమ్యస్థానంగా ఈ అవార్డును ప్రకటించారు.
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు లభించిన ఈ గుర్తింపు నగర ఆహార వారసత్వానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!