6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

Writer: Pooja 05:47 AM, 6 నవంబర్, 2026
మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మురసు తుఫాన్‌ సమయంలో సముద్రంలో ఏర్పడిన తీవ్ర అలల కారణంగా తమిళనాడుకు చెందిన ఓ బోటు మునిగిపోయి ఐదుగురు మత్స్యకారులు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 29వ తేదీన తమిళనాడుకు చెందిన మూడు మత్స్యకార బృందాలు మూడు బోట్లలో చేపల వేటకు బయలుదేరాయి. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రెండు బృందాలకు చెందిన మత్స్యకారులు రామాయపట్నం పోర్టు సమీపంలో తమ బోట్లను నిలిపివేశారు. అయితే, మూడో బోటులో ఉన్న పక్కిరిసామి సూరియా (49), కుప్పన్‌ (48), మోహన్‌ (47), రాజేశ్‌ (52), మురుగన్‌ (48), కుప్పుసామి (58), విజయకాంత్‌ (44), అరవింద్‌ (40), నారాయణన్‌ (57) అనే తొమ్మిది మంది మత్స్యకారులు ఏపీలోని నిజాంపట్నం రేవు వద్ద చేపల వేట కొనసాగించారు.

ఈ క్రమంలో రామాయపట్నం వైపు తిరిగి రావాలని మిగతా బృందాల మత్స్యకారులు వారికి సమాచారం అందించారు. దీంతో ఈ నెల 3వ తేదీ ఉదయం నిజాంపట్నం రేవు నుంచి బయలుదేరిన వారి బోటు, కొత్తపట్నం పల్లెపాలేనికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ అలల ధాటికి సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. బోటులో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాలుగు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మరో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చార్టర్‌ ఫ్లయిట్‌ ద్వారా డ్రోన్‌ కెమెరాలను పంపించి సముద్రంపై గాలింపు చేపడుతోంది. మరోవైపు మత్స్యకారుల కుటుంబ సభ్యులు కొత్తపట్నం తీరానికి చేరుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

తెలంగాణ  కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

ట్యాగ్లు
మురసు తుఫాన్తమిళనాడు మత్స్యకారులుబోటు ప్రమాదంమత్స్యకారుల మృతికోస్ట్ గార్డ్ఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..
జనరల్

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్
ఓటీటీ

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక
రాజకీయాలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!