

సమంత రూత్ ప్రభు తాజాగా నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాతృత్వ ప్రయాణానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. బరువు పెరుగుతోందా అని ఓ అభిమాని అడగగా, ఇప్పటివరకు 11 కిలోలు పెరిగినట్లు సమంత తెలిపారు. ఈ మాతృత్వ దశను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నానని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలనే ప్రశ్నకు అభిమానుల సహాయం కావాలని సమంత పేర్కొన్నారు.
ఇటీవల భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీమూన్‌కు వెళ్లిన సందర్భంగా తీసుకున్న ఫొటోలను కూడా సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి కొత్త ప్రదేశాల్లో గడిపిన క్షణాలు ఆ ఫొటోల్లో కనిపించాయి. తన వర్కౌట్ సెషన్స్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను కూడా ఆమె షేర్ చేశారు. ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత ప్రస్తుతం ఈ కొత్త దశపై దృష్టి సారిస్తూ సినిమాలకు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!