30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

Writer: Chandrika 08:29 AM, 30 సెప్టెంబర్, 2026
సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ తెలంగాణ మహిళ అరుదైన ఘనత సాధించారు. అత్యంత కీలకమైన స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీ రెడ్డి) ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ విజయంతో తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

ఆమెతో పాటు డిప్యూటీ మేయర్‌గా ఎస్తర్ కిమ్ ఎన్నికయ్యారు. అధికారిక ప్రకటన ప్రకారం, మేయర్‌గా సంధ్యారెడ్డి సెప్టెంబర్ 2028 వరకు, డిప్యూటీ మేయర్‌గా ఎస్తర్ కిమ్ సెప్టెంబర్ 2027 వరకు పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ “స్థానిక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత. కౌన్సిలర్లు, సిబ్బంది, ప్రజల సహకారంతో మన ప్రాంతాన్ని జీవించడానికి, పనిచేయడానికి మరింత అద్భుతమైన ప్రదేశంగా మారుద్దాం” అని తెలిపారు.

సంధ్యారెడ్డి నేపథ్యం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌తో ముడిపడి ఉంది. ఆమె స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేశారు. 1991లో వివాహం అనంతరం భర్త కర్రి‌రెడ్డితో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లి, అక్కడ ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు.

కేవలం వృత్తికే పరిమితం కాకుండా, ఆమె స్థానిక సమాజ సేవలో చురుకుగా పాల్గొన్నారు. హోమ్‌బుష్ కమ్యూనిటీ సెంటర్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటులో సంధ్యారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో ‘స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా ఎన్నికై, 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంధ్యారెడ్డి బంధువు. ఆమె విజయ వార్త తెలియగానే, బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వంటి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కౌన్సిల్ నుంచి నిష్క్రమిస్తున్న మేయర్ బెంజమిన్ కాయ్.. సంధ్యారెడ్డికి, ఆమె గతంలో డిప్యూటీ మేయర్‌గా అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పీఎస్5లు, ఫోన్లు, లక్షల నగదు దోపిడీ..

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పీఎస్5లు, ఫోన్లు, లక్షల నగదు దోపిడీ..

ట్యాగ్లు
తెలంగాణహైదరాబాద్సిడ్నీమేయర్సంధ్యారెడ్డిఆస్ట్రేలియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!