
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ లాభాలు వచ్చాయి. 2025 సంవత్సరంలో ఆయన పెట్టుబడుల ద్వారా 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,358 కోట్లు) ఆర్జించినట్లు ప్రభుత్వ నైతికతల కార్యాలయం వెల్లడించింది. డిజిటల్ కరెన్సీల ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో ఈ ఆదాయం స్పష్టంగా చూపిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయి లాభాలు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
1978లో అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులు, ఆదాయ వివరాలను ప్రజలకు వెల్లడించాలి. ఈ నిబంధనల మేరకు ట్రంప్ ఆర్థిక వివరాలు బయటకు వచ్చాయి. క్రిప్టో పెట్టుబడుల ద్వారా వచ్చిన భారీ లాభాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!