

‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్‌కు కుడి భుజంపై విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గాయం లోతుగా ఉండటంతో సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని, సర్జరీ అనంతరం 24 గంటల్లోనే డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఫిజియోథెరపీ కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎన్టీఆర్‌కు సుమారు ఏడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఎన్టీఆర్ రికవరీ ప్రస్తుతం వేగంగా, సానుకూలంగా సాగుతోందని వైద్యులు తెలిపారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో వైద్యులు సూచించిన విశ్రాంతి, జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్‌లోకి తిరిగి రావాలని అభిమానులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!