

చెన్నై పోర్టులో అనుమతులు లేకుండా దిగుమతి చేసిన భారీ మొత్తంలో చైనా బాణాసంచాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, వార్డ్‌రోబ్‌లు, షూ రాక్స్ పేర్లతో కంటైనర్లలో బాణాసంచాను తరలించినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని కంటైనర్లను తనిఖీ చేయడంతో కార్టన్ల వెనుక దాచిన భారీ మొత్తంలో చైనా బాణాసంచా బయటపడింది.
స్వాధీనం చేసుకున్న బాణాసంచా విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండానే బాణాసంచాను దిగుమతి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ వివరాలతో సరుకులను దిగుమతి చేసి, వాటి వెనుక అక్రమంగా బాణాసంచాను తరలించిన విధానంపై అధికారులు దృష్టి సారించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!