
క్రీడలు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) నగర పరిసర ప్రాంతాల్లోని ప్రీమియం ప్లాట్లు, భూముల ఈ-ఆక్షన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మోకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లను విక్రయానికి ఉంచనుంది. అలాగే షేక్‌పేట్ పరిధిలోని హకీంపేట్ వద్ద ఉన్న 8.24 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను కూడా వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ భూమి ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
హకీంపేట్ భూమికి ఎకరాకు రూ.99 కోట్ల అప్సెట్ ధర నిర్ణయించినట్లు సమాచారం. ఈ వేలం ద్వారా HMDA రూ.2,500 కోట్లకు పైగా ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. MSTC ప్లాట్‌ఫామ్ ద్వారా జూన్ 17 నుంచి ఈ-ఆక్షన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రకటనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!