
రాజకీయాలు

ముస్సోరిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. తమ కుమార్తెను భర్తే హత్య చేశాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో డెహ్రాడూన్ కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జూన్ 14 నుంచి 16 మధ్య జరిగిన పరిణామాలతో పాటు, తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం ఎందుకు నిర్వహించారనే అంశాలపై విచారణ జరగనుంది. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!