
జనరల్

ఢిల్లీ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడ్డారు. అయితే అజ్మతుల్లా ఒమర్జాయ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో రాణించిన ఒమర్జాయ్.. ఆఫ్ఘనిస్థాన్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఫ్ఘన్ బ్యాటర్లు ఒక్కసారిగా దూకుడు పెంచారు. వరుసగా 6, 6, 1, 4, 4 పరుగులు రాబట్టి స్కోరును వేగంగా పెంచారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగులు చేయగా, భారత్ ముందు 157 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!