
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధపై కఠిన నియంత్రణలు విధించాలన్న వాదనలను తోసిపుచ్చారు. ఏఐపై భయాలను ప్రతికూల శక్తులే పెంచుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. జరగని విషయాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పులపై చేస్తున్న హెచ్చరికలు అతిశయంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో కృత్రిమ మేధ రంగంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఐర్లాండ్ పర్యటనకు బయల్దేరిన సమయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఏఐలో అమెరికా ప్రస్తుతం చైనాను అధిగమిస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన దేశంగా అమెరికా కొనసాగాలని, ఏఐలో ఎవరు విజయం సాధిస్తే వారిదే ఆధిపత్యమని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధకు సంబంధించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టవచ్చని ట్రంప్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!